The Eagle News భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు ఎండి కరీం పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవేస్ చిస్తీ ,పీసీసీ డెలిగేట్ తంగళ్ళపల్లి రవికుమార్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు హేరే కార్ శ్రీను. ఈ సందర్బంగా కరీం ను పూల బొకే శాలువాతో ఘనంగా సన్మానించారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆశీస్సులతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరీ తయర్ లకంజి వల్లపు నరసింహ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Read MoreTag: Yadadri Bhuvanagiri
బిక్కేరు వాగులోకి నీళ్లు వదిలి రైతుల కన్నీళ్లు తూడ్చిన.. విప్ బీర్ల ఐలయ్య
బిక్కేరు వాగులోకి నీళ్లు వదిలి రైతుల కన్నీళ్లు తూడ్చిన.. విప్ బీర్ల ఐలయ్య The Eagle News మోత్కూరు గుండాల మండలం నుండి మోత్కురు మీదుగా ఆత్మకూరు ముఖ్య నాయకుల,కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న సందర్భంగా బిక్కేరు వాగు పై రైతులు సంతోషం తో వాగు వీక్షిస్తున్న సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వారిని చూసి ఆగి రైతులతో మాట్లాడరు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు సార్లు ఈ వాగు ద్వారా మా పంట పొలాలు,గ్రామాల చేరువులకు నీళ్లు అందిచినందుకు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారికి,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Read Moreవిమాన గోపురమునకు మహాకుంభ సంప్రోక్షణ
The Eagle News యాదాద్రి తెలంగాణా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీయాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానము నందు శ్రీ స్వామి వారి స్వర్ణ విమాన గోపురమునకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమము ఈ నెల 19 తేదీ నుండి 23 వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవోపేతముగా నిర్వహించుటకు ఆలయ ప్రధాన అర్చక స్వాములు నిర్ణయించారని దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఏ .భాస్కరరావు మీడియాకు తెలిపారు. గమనిక:-
Read Moreజలంధర్ రెడ్డి జన్మదినం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన ..అతహర్
జలంధర్ రెడ్డి జన్మదినం సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన ..అతహర్ The Eagle News యాదాద్రి భువనగిరి:బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, విజ్ఞాన్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ యాదాద్రి భువనగిరి చైర్మన్ డా. పగిడాల జలంధర్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్బంగా వారిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు అతహర్.
Read Moreఎంపీ చామల పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం తగదు..మహేందర్
ఎంపీ చామల పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం తగదు..మహేందర్ — చేడే మహేందర్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు వేదికగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై కేంద్రాన్ని నిలదీయడం, ప్రజా సమస్యల పట్ల మాట్లాడటం, మరియు ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్టాలను తెలుసుకొని పరిష్కరించే విదంగా పనిచేస్తూ ప్రజానాయకుడిగా పేరు సంపాదించారు.అలంటి నాయకుడి పై దుష్ప్రచారం చేయడం సరికాదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శిచేడే మహేందర్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు . కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు , హక్కుల కోసం పోరాడుతూ, ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో ముందుండే నాయకుడిగా ఆయన ప్రజల విశ్వాసాన్ని పొందారని అన్నారు.ఆయన ప్రజాదరణను చూసి ఓర్వలేక…
Read Moreఘనంగా మాజీ మార్కెట్ ఛైర్మెన్ జన్మదిన వేడుకలు
పాతగుట్ట లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు …
పాతగుట్ట లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు … యాదాద్రి భువనగిరి జిల్లా ,(యాదగిరిగుట్ట ) పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో 6 వ రోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి . ఆరవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం పూర్ణాహుతి, చక్రతీర్థం అర్చకులు నిర్వహించారు .ఈ పూజల్లో ఆలయ ఈఓ భాస్కర్ రావు,ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి,ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు .సాయంత్రం దేవతోద్వాసన, పుష్పయాగం, డోలోత్సవము నిర్వహిస్తారు
Read Moreగాయపడిన బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ..కిషోర్ కుమార్
వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి
వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి ఈ సందర్బంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ …నల్గొండ జిల్లాలో చెరువుగట్టు దేవస్థానం తర్వాత అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం ఈ వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానం అని అన్నారు.ఈ దేవస్థానానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది ప్రపంచంలో ఎంత కరువు ఉన్నా ఈ కోనేరులో మాత్రం నిత్యం నీరు ఉంటుందని చెప్పారు .ఈ దేవస్థానాన్ని మరియు చెరువుగట్టు దేవస్థానాన్ని ప్రభుత్వం తరఫున మరింత అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు. ఈ దేవస్థానానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణ వెల్లంల లో ఇదే సంవత్సరం ఎత్తిపోతల ప్రాజెక్టుని అప్పటి సీఎంతో శంకుస్థాపన చేయించి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు .ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే మే నెల నాటికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తా.నామీద…
Read Moreయాసంగి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా చూడండీ..జిల్లా కలెక్టర్
యాసంగి ధాన్యం సేకరణ సజావుగా సాగేలా చూడండీ..జిల్లా కలెక్టర్ యాసంగి(రబీ) 2024-25 కు సంబంధించి ధాన్యం సేకరణ సజావుగా జరుగాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు.ధాన్యం సేకరణ గురించి సన్నాహక సమావేశం రాయగిరిలోని లింగ బసవ గార్డెన్ లో అదనపు కలెక్టర్ వీరారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ ఖరీఫ్ పంట కాలంలో ధాన్యం సేకరణ సజావుగా జరిగిందని , అదేవిధంగా రానున్న యాసంగి పంట కాలంలో అధిక దిగుబడి రానున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి ఇప్పటినుంచి ధాన్యం సేకరణకు సంబంధించిన సన్నాహాలు చేయాలని సూచించారు. గత సీజన్ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సమస్యలు తల ఎత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.…
Read More