బిక్కేరు వాగులోకి నీళ్లు వదిలి రైతుల కన్నీళ్లు తూడ్చిన.. విప్ బీర్ల ఐలయ్య
The Eagle News మోత్కూరు
- పారుతున్న బిక్కేరు వాగును సందర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య
- రైతుల కళ్ళల్లోఆనంద బాష్పాలు చూసిన ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య
- మోత్కురు లో గలగలా పారుతున్న బిక్కేరు వాగు, సంతోషం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు
గుండాల మండలం నుండి మోత్కురు మీదుగా ఆత్మకూరు ముఖ్య నాయకుల,కార్యకర్తల సమావేశానికి వెళ్తున్న సందర్భంగా బిక్కేరు వాగు పై రైతులు సంతోషం తో వాగు వీక్షిస్తున్న సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య వారిని చూసి ఆగి రైతులతో మాట్లాడరు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రెండు సార్లు ఈ వాగు ద్వారా మా పంట పొలాలు,గ్రామాల చేరువులకు నీళ్లు అందిచినందుకు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారికి,తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.