పాతగుట్ట లో కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు …
యాదాద్రి భువనగిరి జిల్లా ,(యాదగిరిగుట్ట ) పాతగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి వారి ఆలయంలో 6 వ రోజు బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి . ఆరవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం పూర్ణాహుతి, చక్రతీర్థం అర్చకులు నిర్వహించారు .ఈ పూజల్లో ఆలయ ఈఓ భాస్కర్ రావు,ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహ మూర్తి,ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు .సాయంత్రం దేవతోద్వాసన, పుష్పయాగం, డోలోత్సవము నిర్వహిస్తారు