ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎస్సీ వర్గీకరణ చేసినందుకు రాహుల్ గాంధీ నాయకత్వంలో వారి ఆలోచన విధానంతో తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగలను చేసినందుకు. సీఎం రేవంత్ రెడ్డి గారికి భువనగిరి ఎంపీ ఛామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపిన ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ , టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర కన్వీనర్ పులిగిల్ల బాలయ్య.
గురువారం నాడు భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని హైదరాబాదులోని క్యాంప్ ఆఫీస్ లో మర్యాదపూర్వకంగా ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలోకలిశారు.
ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ జాయింట్ యాక్షన్ కమిటీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చైర్మన్ బర్రె రాజ్ కుమార్, భువనగిరి మండలం చైర్మన్ బుచ్చల మైసయ్య, మరియు పెద్ద అంబర్పేట మున్సిపల్ కార్పొరేషన్ మాజీ కౌన్సిలర్, మండల కోటేశ్వరరావు గారు రాజి రెడ్డి గారు తదితరులు ఈ సందర్బంగా కలిశారు.