గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకొని తిరిగిన సీఎం రేవంత్ రెడ్డి కి అదే రిటర్న్ గిఫ్ట్ వచ్చింది అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశం లోవారు మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి పై సెటైర్లు వేశారు.
- మహారాష్ట్ర లో గాడిద గుడ్డు ఇచ్చారు, నిన్న ఢిల్లీలో గాడిద గుడ్డే ఇచ్చారు
- ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో బిజెపి విజయం చారిత్రాత్మక విజయం అని అన్నారు.
- అభివృద్ధి ని అటకేక్కించిన అప్ ను ఢిల్లీ ప్రజలు ఊడ్చేశారు
- ఏ చీపురు గుర్తుతో ఆప్ అధికారంలోకి వచ్చారో అ చీపురు గుర్తుతోనే ఊడ్చేశారు
- మోదీ అభివృద్ది గ్యారంటీకి ఢిల్లీ ప్రజలు ఓటు వేశారు
పదేళ్లలో పాడు చేశారు…
గత పదేళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ అద్వాన్నంగా తయారైయిందని,అభివృద్దే అజెండాగా అక్కడి ప్రజలు మార్పు కోరుకుని స్వయంగా ప్రచారం చేశారు అని చెప్పారు.గొప్ప విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
ఖేల్ ఖతం….
కాంగ్రెస్ ను ఇక నమ్మే పరిస్థితి లేదు,కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని కోల్పోయింది గతంలో అధికారం లో ఉన్నా కాంగ్రెస్ కు ఒక్క సీటు రాలేదు.ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ విఫలం అయ్యారు అని విమర్శించారు.
ఇక్కడేమి చేతగాక….
తెలంగాణలో 420 హామీలు ఇచ్చి ఆమలు చేయని కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకోవాలి.ఇక్కడ మేము చార్సవు బిస్ అయినా… మేము రోల్ మోడల్ అని ప్రచారం చేశాడు.మహారాష్ట్రలో ప్రచారం చేస్తే బీజేపీ గెలిపించారు, ఇప్పుడు డిల్లీలో కుడా ఓడించారు దేశంలో కాంగ్రెస్ పని అయిపోయినట్లే అని డీకే అరుణ జోష్యం చెప్పారు.
అసలు మీరేం చేశారు..
ఇక్కడున్న కాంగ్రెస్ ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు, Pm అవాస్ యోజన నిధులతో ఇందిరమ్మ ఇళ్ళు అని పేరు పెడితే ఊరుకోము,చిత్తశుద్ది ఉంటే ఇందిరమ్మ ఇళ్ళు వేరే కట్టించండి, లేదా పేరు మార్చండి అని అన్నారు.