రంగారెడ్డి జిల్లా, ఫరూక్ నగర్ మండలం, మహల్ ఎలికట్ట గ్రామం లో పాలమూరు ప్రజా వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ మరియు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జ్యోతిరావు ఫులే ల విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి
ముఖ్య అతిథిలుగా రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్, శాసనసభ్యులు వీర్లపల్లి శంకరయ్య , కాంటెస్టెడ్ ఎంపీ నిలం మధు గార్లు హాజరై ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ… మహల్ ఎలికట్ట గ్రామం , షాద్ నగర్ లో పాలమూరు ప్రజా వీరుడు పండుగ సాయన్న ముదిరాజ్ గారి విగ్రహా ఆవిష్కరణ చేయడం చాలా ఆనందదాయకం అన్నారు
ప్రజా వీరుడు, తెలంగాణ రాబిన్ హుడ్, స్వేచ్ఛ, స్వాతంత్య్రం, సమానత్వం కోసం పెత్తందారీ వ్యవస్థపై రాజీలేని పోరాటం చేసిన పోరాట యోధుడు, బహుజన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన సూర్యుడు, సామాజికవేత్త, దార్శనికుడు పండుగ సాయన్న అన్నారు.
ఈ కార్యక్రమంలో గుడిమాల్కాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి మల్లేష్ ముదిరాజ్,అందే బాబయ్య ముదిరాజ్, వెంకటేష్ ముదిరాజ్ మరియు ముదిరాజ్ సంఘాల అధ్యక్షులు నాయకులు ప్రముఖులు పాల్గొన్నారు.