మరాఠ సామ్రాజ్య వీరుడు ,పరాయి పాలకులను తుదముట్టించి అఖండ భారతావనికి తిరిగి స్వరాజ్య పాలన సాధించిన ధీరుడు,తల్లి జిజియా భాయి తనయుడు, హిందుత్వానికి శిర మకుటం పెట్టిన హైందవ వీరుడు, హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ 395 వ జయంతి వేడుకలు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రం అంబేద్కర్ చౌరస్తాలోఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహ ఏర్పాటు కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్బంగా శివాజీ మహారాజ్ కి పూలమాలలు వేసి నమస్కరించారు.అభిమానులు పెద్ద ఎత్తున జై భవానీ వీర శివాజీ అంటూ నినాదాలు చేస్తూ నివాళులు అర్పించారు.ధైర్యాని కిధీరత్వాన్ని మరో పేరు శివాజీ అని కమిటీ సభ్యులు పేర్కొన్నారు.