యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి సువర్ణ దివ్య విమాన రాజగోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవములు అత్యంత వైభవముగా ఈరోజు ప్రారంభమయ్యాయి.
శ్రీ స్వామివారి ఆలయంలో నిత్యారాధనల అనంతరం శ్రీ స్వామివారి సువర్ణ దివ్య విమాన రాజగోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవములు లో భాగంగా ఉదయం 7 : 45 నిమిషాల నుండి భగవత్ అనుజ్ఞ స్వస్తివాచనము శ్రీ విశ్వక్సేనారాధన పుణ్య వాహచనము రక్షాబంధనము రుత్విక్ వరణము మృత్యుం గ్రహణము పర్యజ్ఞీకరణము తిరువీధి సేవ యాగశాల ప్రవేశము అఖండ దీపారాధన కుంకుమార్పన ద్వారా తోరణా ధ్వజ కుంభారాధన అగ్ని ప్రతిష్ట నిత్య హోమము మూల మంత్రమూర్తి మంత్ర వాహనము నిత్య పూర్ణాహుతి నివేదన నీరాజనా మంత్రపుష్పము శాత్తుమరై తీర్థ ప్రసాద గోష్టి కార్యక్రమములను శ్రీ పాంచ రాత్రాగమము శాస్త్రమానుసారముగా శ్రీ శ్రీ వానమాలై మఠం 31వ మధురకవి రామానుజ జీయర్ స్వామి వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు ఉప ప్రధానార్చకులు యజ్ఞాచార్యులు అర్చక బృందం వేద పండితులు పారాయణికులు అత్యంత వైభవముగా నిర్వహించారు.
ఈ వేడుకలలో ఆలయ అనువంశిక ధర్మకర్త శ్రీ నరసింహమూర్తి కార్యనిర్వహణ అధికారి భాస్కరరావు దేవస్థానం సిబ్బంది పాల్గొన్నారు.
సాంస్కృతిక కార్యక్రమములు.. శ్రీ స్వామివారి బంగారు విమానా గోపుర మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంలలో భాగంగా ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడును అని కార్యనిర్వాహణాధికారి ప్రకటన ద్వారా తెలిపారు.