ఈగల్ న్యూస్ :సూర్యాపేట ( పెద్దగట్టు)
- అంగరంగ వైభవంగా ప్రారంభమైన దురాజ్పల్లి పెద్దగట్టు లింగమంతుల జాతర
- ఈనెల 20వ తారీకు వరకు సాగనున్న జాతర, తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున రానున్న భక్తులు
తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జాతర అయినటువంటి సూర్యాపేట జిల్లా దురాజ్పల్లిలోని పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతరకు సంబంధించి జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ పవర్,జిల్లా ఎస్పీ సంప్రీత్సింగ్ మానిటరింగ్ ఎప్పటికప్పుడు చేస్తున్నారు. సుమారుగా 2 వేల మంది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖల వారు సమన్వయంతో ఏర్పాట్లు పటిష్టంగా చేశారు.
పెద్దగట్టు లింగమంతుల స్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రివర్యులు ఉత్తంకుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజాస్ నందలాల్ కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు, ఇతర ప్రముఖులు,ముఖ్య నాయకులు దర్శించుకున్నారు.