ది ఈగల్ న్యూస్ చెర్వుగట్టు
తెలంగాణలో శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన దేవస్థానం నల్గొండ జిల్లాలోని నార్కెట్ పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని దర్శించుకున్న భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం.
చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీ అయిన తర్వాత మొదటిసారిగా చెరువుగట్టు దేవస్థానానికి వచ్చిన ఎంపీ కి ఘన స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.ప్రత్యేక పూజలు అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి స్వామివారి ప్రత్యేకతను ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కి తెలిపిన ఆలయ అర్చకులు.