ది ఈగల్ న్యూస్ :హైదరాబాద్
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం కోటమర్తి గ్రామానికి చెందిన గూడ దశరథ గౌడ్ తాటి చెట్టు పై నుండి పడి గాయాల పాలై హైదరాబాద్ నాగోల్ లోని సుప్రజ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని దశరథ గౌడ్ ను పరామర్శించిన తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్. యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కొంత ఆర్థిక సాయం చేశారు.వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందించాలని హాస్పిటల్ డాక్టర్లను కోరారు.