తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన దేశానికి ఆదర్శం – రాష్ట్ర నాయకురాలు శ్రీమతి రేఖ బోయలపల్లి.
తెలంగాణ ప్రభుత్వం చేసిన కులగణన సర్వే ని అసెంబ్లీ ఆమోదించడం హర్షనీయం అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు శ్రీమతి రేఖ బోయలపల్లి అన్నారు.కామారెడ్డి సభలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ ప్రకారం కులగణన చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఘనత ప్రజా ప్రభుత్వందే అని అన్నారు. దేశ చరిత్రలో ఏ ప్రభుత్వాలు చేయని కుల ఘనన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది, ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అక్కసు తో ప్రతిపక్షాలు విమర్శలు చేయడం తగదు.సమగ్ర కుటుంబ సర్వేను టిఆర్ఎస్ పార్టీ రాజకీయం కోసం వాడుకుందని, కనీసం అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా ప్రజలకు కూడా తెలియజేయలేదని విమర్శించారు. సర్వేకు సహకరించని కల్వకుంట్ల ఫ్యామిలీకి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో చేసిన విధంగానే కులగణన దేశవ్యాప్తంగా చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సర్వే అన్ని వర్గాల ప్రజలకి సమాన న్యాయం చేకూరుతుందని అన్నారు.బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం చేసే కార్యక్రమాలను అడ్డుకోవద్దని శ్రీమతి రేఖ బోయలపల్లి కోరారు.