యుంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సియల్ స్కూల్స్ కోసం 11600 కోట్లు మంజూరు
55 అసెంబ్లీ నియోజక వర్గాలలో ఏర్పాటు చేయనున్న ప్రభుత్వం
పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం, ప్రపంచంలో పోటీపడే విధంగా ప్రణాళిక
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కగారికి అభినందనలు మరియు ధన్యవాదాలు
సీఎం రేవంత్ రెడ్డి గారు పని చేసే దూరదృష్టి ఉన్న నాయకుడు, మీలాగ అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసే వ్యక్తి కాదు అని ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ను విమర్శించిన సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి, ఏఐసిసి మెంబర్ డా. కోట నీలిమ.బి ఆర్ ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా బూటకపు వాగ్దానాలు చేసి విద్యార్థులకు ద్రోహం చేశారని, కేజీ-2-పీజీ కొత్త పాఠశాలలు లేవు, విద్యకు ఇన్ఫ్రా లేదు, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు లేవు కనీసం ఇప్పుడు కేటీఆర్కు శుభాకాంక్షలు చెప్పే ధైర్యం ఉందా? మీరు ఇకపై ట్వీట్ చేసి అమలు చేయలేరు. మంచి పాఠశాలలు లేకపోతే విద్యార్థులు పరీక్షల్లో ఎలా రాణిస్తారు?అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం, ప్రపంచంతో పోటీపడే విధంగా వారు తయారవడం కోసం 11600 కోట్లు కేటాయించి 55 నియోజకవర్గ కేంద్రాలలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను నిర్మిస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు.
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఏనాడు కూడా పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం ఆలోచించింది లేదు, వారి సంక్షేమం కోసం పట్టించుకున్నది లేదని విమర్శించారు.4వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఒకే గొడుకు కింద ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలతో పాటు ప్రపంచ స్థాయి విద్య, విద్యార్థులకు అత్యంత పౌష్టికాహారం అందించడం చాలా సంతోషకరమన్నారు.దేశానికి ఆదర్శంగా నిలిచే విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కగారికి అభినందనలు మరియు ధన్యవాదాలు తెలిపారు.