ది ఈగల్ న్యూస్: హైదరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కొలువుల జాతర అని ,కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
గ్రూప్ 1 ,గ్రూప్ 2 నూతన అభ్యర్థులు ప్రజా పాలనలో భాగం కావాలని పిలుపు నిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యోగాల భర్తీ సాధ్యమని రుజువు అయిందని అన్నారు. పది ఏళ్లలో సాధ్యం కాని గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ కాంగ్రెస్ ప్రభుత్వం లో సాధ్యం అయిందని అన్నారు.బి ఆర్ ఎస్ హయాంలో లీకేజీ ల తో నిరుద్యోగులు భయం తో పరీక్ష లకు దూరం అయ్యారని చెప్పారు.దేశంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అత్యంత పారదర్శకంగా పరీక్షలు జరిపిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది అని అన్నారు. ప్రజా పాలన లో కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలు చేరవేయడం లో వారధులుగా పనిచేయాల్సిన బాధ్యత నూతన అభ్యర్థుల పై ఉందని అన్నారు. రానున్నరోజులలో మరిన్ని ఉద్యోగాల భర్తీ ఉంటుందని చెప్పారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ కోసం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. గ్రూప్ 1 రద్దుకు బి ఆర్ ఎస్ కుట్ర చేసిందని, న్యాయం నిరుద్యోగుల వైపు ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిరుద్యోగుల తరుపున ధన్యవాదములు తెలిపారు.