ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు శంకర్ నాయక్, అద్దంకి దయాకర్, విజయశాంతి లకు శుభాకాంక్షలు తెలిపిన పీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ శుభాకాంక్షలు తెలిపారు.గత 30 ఏళ్లు గా పార్టీకి నిబద్ధతతో పని చేస్తున్న ఒక ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయక్ కు అవకాశం ఇవ్వడంతో కార్యకర్తలకు పార్టీ భరోసా ఇచ్చింది అని చెప్పారు.అదేవిదంగా 2014 నుంచి కాంగ్రెస్ పార్టీ లో క్రియాశీలకంగా పని చేస్తూ తెలంగాణ ఉద్యమ కారుడిగా పేరున్న అద్దంకి దయాకర్ రెండు సార్లు తక్కువ ఓట్లతో ఓడిపోయిన నిత్యం ప్రజా సమస్యలపై పోరాటాలు చేసారని, కాంగ్రెస్ పార్టీ గొంతుకగా బీజేపీ, బిఆర్ఎస్ పార్టీల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేసారని టీపీసీసీ అధ్యక్షులు అన్నారు. అద్దంకి దయాకర్ కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో తెలంగాణ సమాజం హర్షం వ్యక్తం చేస్తుందని అన్నారు. బిసి సామాజిక వర్గానికి చెందిన తెలంగాణ పోరాట నేత విజయశాంతికి టికెట్ ఇవ్వడంతో బిసి, మహిళ కు అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయం తీసుకుందని, పొత్తు ధర్మంలో భాగంగా ఒక స్థానాన్ని సీపీఐ కి కేటాయించడం జరిగిందని అన్నారు. రేపు అసెంబ్లీలో కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులు నామినేషన్ వేస్తారని అన్నారు.