ది ఈగల్ న్యూస్: హైదరాబాద్
తిరుమల, తిరుపతి దేవస్థానం ఆస్థాన గాయకుడు
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ మృతికి సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యమరియు ఐటి శాఖల మంత్రి వర్యులు నారా లోకేష్.గరిమెళ్ళ మృతి చెందారనే వార్త బాధ కలిగించిందాని తెలిపారు. 1978 నుండి 2006 వరకు టిటిడిలో ఆస్థాన గాయకుడిగా పనిచేసిన గరిమెళ్ళ గారు,600లకు పైగా అన్నమాచార్య సంకీర్తనలకు స్వరకల్పన చేశారు. సాంప్రదాయ కర్ణాటక సంగీతం, లలిత సంగీతం, జానపద సంగీతంలో తమదైన ముద్ర వేసిన శ్రీ గరిమెళ్ళ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అని అన్నారు.వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.గరిమెళ్ళ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్ధించారు.