తెలంగాణా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీయాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానము నందు శ్రీ స్వామి వారి స్వర్ణ విమాన గోపురమునకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమము ఈ నెల 19 తేదీ నుండి 23 వరకు 5 రోజుల పాటు అత్యంత వైభవోపేతముగా నిర్వహించుటకు ఆలయ ప్రధాన అర్చక స్వాములు నిర్ణయించారని దేవాలయ కార్యనిర్వహణ అధికారి ఏ .భాస్కరరావు మీడియాకు తెలిపారు.
ఈ నెల23 న ఉదయం 11.54 ని.లకు మూలా నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కారంశ సుముహూర్తమున శ్రీ సుదర్శన లక్ష్మీ నారసింహ దివ్య స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక ప్రతిష్టామహోత్సవం జరుపుటకు నిర్ణయించామని చెప్పారు.
గమనిక:-
తేది.19-02-2025 నుండి 23-02-025 వరకు సుదర్శన హోమములు జరుపబడవు. తేది. 23.02.2025 రోజున సుదర్శన హోమములు, సువర్ణ పుష్పార్చనలు, కళ్యాణోత్సవములు నిలిపివేయబడును మరియు శ్రీస్వామి వారికి సహస్ర నామార్చన, అభిషేకములు యథావిధిగా జరుగుతాయని తెలిపారు.
శ్రీస్వామి వారి స్వర్ణ విమాన గోపురమునకు తేది.19.02.2025 నుండి తేది.23.02.2025 వరకు మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమము నిర్వహించుచున్న దృష్ట్యా తేది. 17.02.205 రోజు సోమవారం రోజున శ్రీ స్వామి వారి ఆలయంలో తిరుమంజన (ఆలయ శుద్ధి) కార్యక్రమము నిర్వహించుటకు నిర్ణయించనైనది. అందువలన తేది.17.02.2025 రోజున మద్యాహ్నం గం.1-00ల నుండి గం.3-30 ని. ల వరకు భక్తులకు శ్రీస్వామి వారి దర్శనం నిలిపివేస్తున్నట్లు చెప్పారు.