వేణుగోపాల స్వామి కళ్యాణం లో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం గోపాలయపల్లి గుట్టపై శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఘనంగా ప్రారంభం ఐన వార్షిక బ్రహ్మోత్సవాలు.ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వామి అమ్మవార్లకు తీరు కళ్యాణ మహోత్సవం జరిగింది.కల్యాణంలో పాల్గొన్న రోడ్లు , భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అనువంశిక చైర్మన్ కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ అధికారులు.
ఈ సందర్బంగా మంత్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ … నల్గొండ జిల్లాలో చెరువుగట్టు దేవస్థానం తర్వాత అత్యంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం ఈ వారిజాల వేణుగోపాలస్వామి దేవస్థానం అని అన్నారు.ఈ దేవస్థానానికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది ప్రపంచంలో ఎంత కరువు ఉన్నా ఈ కోనేరులో మాత్రం నిత్యం నీరు ఉంటుందని చెప్పారు .ఈ దేవస్థానాన్ని మరియు చెరువుగట్టు దేవస్థానాన్ని ప్రభుత్వం తరఫున మరింత అభివృద్ధి చేసి చూపిస్తా అని హామీ ఇచ్చారు. ఈ దేవస్థానానికి సమీపంలో ఉన్న బ్రాహ్మణ వెల్లంల లో ఇదే సంవత్సరం ఎత్తిపోతల ప్రాజెక్టుని అప్పటి సీఎంతో శంకుస్థాపన చేయించి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు .ఈ ప్రాజెక్టు ద్వారా వచ్చే మే నెల నాటికి లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తా.నామీద కోపంతో బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టును అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి చేయకుండా పక్కన పెట్టాడు.10 సంవత్సరాల కేసీఆర్ పాలనలలో ఇక్కడ రైతులు హరిగోశబడ్డారు. బోర్లు వేసి అప్పాలయ్యారుఅని అన్నారు .80% పూర్తయిన ప్రాజెక్టులను కేసీఆర్ పక్కన పెట్టడం వల్లనే ప్రజల పాపం తలిగి టిఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది.రైతు ధర్నాలు చేస్తున్న కేటీఆర్ ఈ ప్రాంతానికి వచ్చి ఇప్పుడు మా పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారో లేదో తెలుసుకోవాలి.దేవుని ఆశీస్సులతో తెలంగాణలోని నాలుగు కోట్ల మంది బాగుండాలని కోరుకున్నా అని తెలిపారు.