కులగణన సర్వేపై కేటీఆర్ కు అవగాహన లేదు..టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
- తెలంగాణలో కులగణన సర్వే పాదర్శకంగా జరిగిందని సర్వేపై కేటీఆర్ కు అవగాహన లేదని టిపిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.
- మాజీమంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ కులగరణ సర్వే పై ఎలాంటి ఆధారాలు లేకుండా మాట్లాడడాన్ని తప్పడుతూ దానికి పత్రికా ప్రకటన ద్వారా కౌంటర్ ఇచ్చారు.
కేటిఆర్ ఎలాంటి ఆధారాలు లేకుండా బిసి కులఘనన ను తప్పులు తడక అంటున్నారు.
ఎంతో శాస్త్రీయంగా లక్షకు పైన సిబ్బందిని పెట్టి ఇల్లిల్లు పరిశీలన చేసి ఘనన చేయడం జరిగిందని అన్నారు.కులగనన దేశానికే ఆదర్శంగా చేపట్టము.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే భరించలేక కేటిఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని అన్నారు.రాహుల్ గాంధీ ఆదేశాలనుసారం కులగణన సర్వేను కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పంతో పూర్తి చేసిందికులగణన సర్వేపై కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని చెప్పారు.
1931 తర్వాత కులఘనన జరిగింది ఇది బీసీ లకు ఎంతో మేలు జరుగుతుంది.పక్కాగా పకడ్బందీగా కులఘనన ను దేశంలోనే మొదటిసారి చేసిన ఘనత మా కాంగ్రెస్ ప్రభుత్వానిది. 2014 లో సమగ్ర కుటుంబ సర్వే చేసి కనీసం ఆ లెక్కలను కూడా బయటకు చెప్పలేని అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడు మాట్లాడడం అవివేకం అని విమర్శించారు.
బీసీలకు న్యాయం జరుగుతుంటే కేటీఆర్ భరించలేక పోతున్నారు.కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులు రీ సర్వే గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.బలహీనవర్గాల గురించి కేటీఆర్ మాట్లాడటం హస్యాస్పదం.పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో బీసీలకు తీరని అన్యాయం జరిగింది.ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిఆర్ఎస్- బీజేపీ లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయి అని అన్నారు.ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటిచేయడానికి బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు లేరు పార్లమెంట్ ఎన్నికల్లో మాదిరిగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గూడ పరోక్షంగా బీజేపీకి బిఆర్ఎస్ మద్దతిస్తుందన్నారు.