ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ నగరం లో తెలుగు అసోసియేషన్ సెలబ్రేషన్స్ లో
పాల్గొన్న టీపీసీసీ అధ్యక్షులు MLC మహేష్ కుమార్ గౌడ్,SATS చైర్మన్ శివసేనారెడ్డి, సలహా దారు జితేందర్ రెడ్డి
ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ…
ఎల్లలు దాటి ఆస్ట్రేలియా కు వచ్చినా కూడా మన తెలుగు సాంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతూ అందరూ కలిసి సంబరాలు నిర్వహించుకోవడం చాలా అభినందనీయం అని అన్నారు.తెలుగు ప్రజలు ఇక్కడ లక్ష మంది ఉండి ఎంతో కష్టపడి అభివృద్ధి కి సహకారాన్ని అందిస్తూ మన సంప్రదాయాలను కాపాడుతూ ఇలా సంబరాలు చేస్కోవడం గొప్ప విషయం అని చెప్పారు.మన తెలుగు పల్లెల్లో చేసుకున్న విదంగానే ఇక్కడ పండుగ చేసుకుంటూ ఆనందంగా పండుగ జరుపుతున్నారు.తెలంగాణ లో మన ప్రభుత్వం ఉంది ఇక్కడ ఉన్న తెలుగు పారిశ్రామిక వేత్తలు మీ ప్రాంతాలలో పెట్టుబడులు పెట్టి అక్కడ అభివృద్ధికి సహకారాన్ని అందించాలి.
మీఅందరిని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు .ఈ సంక్రాంతి ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు , ఆనందం నింపాలి.సంస్కృతి సంప్రదాయాలు పరిమళించే అతి పెద్ద పండుగ సంక్రాంతి సంక్రాంతి ప్రకృతితో అనుసంధామైన రైతుల పండుగ ఆరుగాలం శ్రమించి చేతికొచ్చిన పంటను చూసి రైతు మురిసిపోయే పండుగ.ఈ సంక్రాంతి తో రైతుల కుటుంబాల్లో సుఖసంతోషాలు వెల్లివిరియాలి.