22 మార్చి 2010
జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ ఉద్యమ యాత్ర రెండవ రోజు భద్రాచలంలో ప్రారంభమై పాల్వంచ కొత్తగూడెం ఇల్లందు బయ్యారం తదితర ప్రాంతాల మీదుగా ఖమ్మం చేరుకుంది.
22 మార్చి 2011 న చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమీ జరగలేదు
22 మార్చి 2012 న తెలంగాణ ఉద్యమంలో పెద్దగా చెప్పుకోదగిన సంఘటనలు ఏమీ లేవు
22 మార్చి 2013
అరెస్టులకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు
సడక్ బంద్ సందర్భంగా గురువారం తెలంగాణ ఉద్యమ నాయకులను తెలంగాణ వాదులను అరెస్టు చేసి జైలలో నిర్బంధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ పది జిల్లాల్లో నిరసన హోరెత్తాయి. తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు ధర్నాలు దిష్టిబొమ్మ దహనాలను నిర్వహించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నిజామాబాద్ జిల్లా మహాసభ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది.