అక్టోబర్ 09 -2009
ఫ్రీజోన్ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు. హైదరాబాద్ 6వ జోన్లో భాగమైన ప్పటికి రాష్ట్రపతి ఉత్తర్వు లోని 14ఎఫ్ నిబంధన అనుసరించి పోలీస్ అధికారుల నియామకాల విషయంలో మాత్రం ఫ్రీజోన్గా పరిగణించాలని తీర్పునిచ్చింది.
అక్టోబర్ 11 – 2009
ఫ్రీజోన్ పై సుప్రీం కోర్టు తీర్పుకు నిరసనగా తెలంగాణ ఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో టిఎన్టీవో భవన్ నుంచి ఛలో అసెంబ్లీ కార్యక్రమం, గన్ పార్కువద్ద జరిగింది.
13 అక్టోబర్ -2009
ఫ్రీజోన్ పై సుప్రీం కోర్టు తీర్పుకు నిరసనగా తెలంగాణ ఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా.
అక్టోబర్ 4 – 2010
తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టుల నినాదంతో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాదులో మీడియా మార్చ్ నిర్వహించడం జరిగింది.
అక్టోబర్ 5 – 2010
తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం అమెరికా పర్యటన
అక్టోబర్ 11 – 2010
సింగరేణి జేఏసీ స్టీరింగ్ కమిటీ భూపాలపల్లి లో ప్రత్యేక సమావేశం ముఖ్యఅతిథిగా హాజరైన జేఏసీ కోఆర్డినేటర్ పిట్టల రవీందర్ సింగరేణి సమస్యలపై ఉద్యమించాలని నిర్ణయం
అక్టోబర్ 14 -2010
తెలంగాణ నాలుగు జిల్లాలోని అన్ని సింగరేణి ప్రాంతాలలో కార్మిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి జేఏసీ ఆధ్వర్యంలో ధర్నాలు
అక్టోబర్ 22 -2010
వరంగల్ జిల్లా మహబూబాబాద్ లో స్థానిక జేఏసీ ఆధ్వర్యంలో నిర్మించ తలపెట్టిన అమరవీరుల స్మారక స్థూపానికి భూమి పూజ నిర్వహించిన జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ పిట్టల రవీందర్
అక్టోబర్ 23 -2010
సిద్దిపేటలోని జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక మెదక్ జిల్లా మహాసభ కు హాజరైన జేఏసీ చైర్మన్ కోదండరాం వేదిక ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్
అక్టోబర్ 24 -2010
సూర్యాపేటలో జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక నల్గొండ జిల్లా మహాసభకు హాజరైన జేఏసీ చైర్మన్ కోదండరాం వేదిక ప్రధాన కార్యదర్శి పిట్టల రవీందర్

అక్టోబర్ 25 – 2010
తెలంగాణ కోసమే తెలంగాణ జర్నలిస్టులు నినాదంతో తెలంగాణ జర్నలిస్టుల పోరం సదస్సు
రంగారెడ్డి తూర్పు జిల్లా ఆధ్వర్యంలో చైర్మన్ వెదిరె చల్మారెడ్డి అధ్యక్షతన కొత్తపేటలోని అంబేద్కర్ భవన్లో సదస్సు, హాజరైన జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ పిట్టల రవీందర్ తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్
అక్టోబర్ 27 -2010
భూపాలపల్లి లో 33వ రోజులకు చేరిన తెలంగాణ రిలే నిరాహార దీక్షలు ప్రత్యేక సదస్సు ముఖ్యఅతిథిగా హాజరైన జేఏసీ రాష్ట్ర కోఆర్డినేటర్ పిట్టల రవీందర్
అక్టోబర్ 28 – 2010
రంగారెడ్డి జిల్లా తాండూర్ లో జరిగిన తెలంగాణ విద్యావంతుల వేదిక జిల్లా మహాసభ
అక్టోబర్ 29 -2010
హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ బోర్డు శతాబ్ది ఉత్సవాలు.
హైదరాబాద్ రాష్ట్ర విద్యుత్ బోర్డు శతాబ్ది ఉత్సవాల్లో జై తెలంగాణ నినాదం మిన్నంటింది. తెలంగాణ విద్యుత్ ఉద్యోగుల జేఏసీ శుక్రవారం ఇక్కడ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఈ ఉత్సవాలను విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకుడు కే రఘు అధ్యక్షత వహించారు. డిసెంబర్ 31 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరాలంటూ పలువురు నినాదించారు. లేనిపక్షంలో తెలంగాణ పది జిల్లాల్లో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తామని హెచ్చరించారు. సీఎం రోశయ్య ఇంటికి కరెంటు తీసేస్తామని స్పష్టం చేశారు.
అయ్యా పీఎం గారు, సీఎం గారు ఈరోజు తెలంగాణ బెబ్బులిలా లేచి కూర్చొని ఉంది కాంట్రాక్టు ఉద్యోగులను జూనియర్ లైన్మెన్ గా నియమించాలని హైకోర్టు తీర్పు చెప్పినా ఇక్కడ అమలు చేయకుండా ఆంధ్రాలో అమలు చేశారు మంచిగా అయితే సరే లేకుంటే కటుకలు బందు చేస్తే వారే దారికొత్తరు పదేళ్ల కింద కేసీఆర్ ఒక్కడే ఇప్పుడు అందరూ కేసీఆర్ లే అధికారులను పిలిచినా ఒక్కరు రాలేదు వాళ్లకు సిగ్గులేదు 1956లో ఏ తెలంగాణ అయితే ఆంధ్రాలో కలిపారో ఆ తెలంగాణ కావాలి దానికి ఇంచ్ తగ్గిన ఒప్పుకోం.
కేసీఆర్ టిఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం