ఆశిర్వదించండి అభివృద్ధి చేసి చూపిస్తా..దొడ్ల వెంకట్

Bless you if you develop it and show it..Dodla Venkat

ది ఈగల్ న్యూస్ : సంగారెడ్డి తెలంగాణ ప్రజాశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి దొడ్ల వెంకట్ ప్రచారంలో భాగంగా పట్టణంలోని వివిధ కాలేజీలలో విస్తృత ప్రచారం చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, నిరుద్యోగులు,విద్యావంతులు ఉపాద్యాయులు పెద్ద మనస్సుతో ఆశీర్వదించి ఎమ్మెల్సీ ఎన్నికలలో గెలిపిస్తే సామాన్యులకు సైతం నాణ్యమైన విద్యను అందించే దిశగా కృషి చేస్తానని అన్నారు.అదే విధంగా పరిశ్రమల్లో స్థానికులకే ఉన్నత ఉద్యోగాలు వచ్చే విధంగా చర్యలు తీసుకుంటాం అని ఆయన చెప్పారు.బీజేపీ ,కాంగ్రెస్ అభ్యర్థులని ఎవరు నమ్మే పరిస్థితి లో లేరని అన్నారు. తెలంగాణ ప్రజాశక్తి పార్టీ కి ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నారని, పట్టభద్రుల ఆశీర్వాదంతో గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు పట్లోల్ల రామ్ రెడ్డి, రుమాండ్ల మురళి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Read More