గాడిద గుడ్డు నెత్తిన పెట్టుకొని తిరిగిన సీఎం రేవంత్ రెడ్డి కి అదే రిటర్న్ గిఫ్ట్ వచ్చింది అని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. మహబూబ్ నగర్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశం లోవారు మాట్లాడుతూ ఢిల్లీలో కాంగ్రెస్ ఓటమి పై సెటైర్లు వేశారు. పదేళ్లలో పాడు చేశారు…గత పదేళ్ల ఆప్ పాలనలో ఢిల్లీ అద్వాన్నంగా తయారైయిందని,అభివృద్దే అజెండాగా అక్కడి ప్రజలు మార్పు కోరుకుని స్వయంగా ప్రచారం చేశారు అని చెప్పారు.గొప్ప విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఖేల్ ఖతం….కాంగ్రెస్ ను ఇక నమ్మే పరిస్థితి లేదు,కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో పూర్తి విశ్వాసాన్ని కోల్పోయింది గతంలో అధికారం లో ఉన్నా కాంగ్రెస్ కు ఒక్క సీటు రాలేదు.ప్రతిపక్ష నాయకుడుగా రాహుల్ విఫలం అయ్యారు అని విమర్శించారు. ఇక్కడేమి చేతగాక….తెలంగాణలో 420 హామీలు…
Read More