ఎస్సీ వర్గీకరణ శాస్త్రీయంగా జరిగింది.ఎమ్మెల్యే మందుల సామేలు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ఏబిసిడి వర్గీకరణ, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీకులగనన చేపట్టిందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు అన్నారు..ఎస్సీ వర్గీకరణ 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం అని చెప్పారు.తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని.ఎస్సీ వర్గీకరణ చేపట్టిన ఘనతకాంగ్రెస్ పార్టీ అన్నారు..గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఫిబ్రవరి 4వ తేదీనసామాజిక న్యాయ దినంగా ప్రకటించామన్నారు.పదేళ్లు ప్రభుత్వంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఏనాడు మాదిగల పక్షాన లేదని విమర్శించారు.ఉపముఖ్యమంత్రిగా రాజయ్యను నియమించి 7 నెలల్లోనే తొలగించారని ఆరోపించారు.కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుందన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నిటిని 100% అమలు చేస్తుందని తెలిపారు.
Read More