The Eagle News ఉప్పల్
- సమాజం లో ఎదురైనా అవరోధాలు దాటుకుంటూ సంఘసంస్కర్తగా పనిచేసిన బంజారా ఆధ్యాత్మిక నాయకుడు సంత్ సేవాలాల్ బోధనలను ప్రజలు అనుకరించాలని చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జి హెచ్ ఎం సి స్టాండింగ్ కమిటీ మెంబర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ అన్నారు.
సంత్ సేవాలాల్ 286 వ జయంతి సందర్బంగా ఉప్పల్ చిలుకనగర్ చౌరస్తాలో శ్రీ తుల్జా భవాని లంబాడి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కొర్య కృష్ణా నాయక్ మరియు వారి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జయంతి వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్బంగా కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ..సమాజ శ్రేయస్సు కోసం సంత్ సేవాలాల్ చూపిన మార్గం ఆదర్శనీయమన్నారు. సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు .బంజారాల అభ్యున్నతి కోసం మహనీయుడు సేవాలాల్ మహారాజ్ ఎంతో కృషి చేశారన్నారు.సేవాలాల్ మహారాజ్ గారి గొప్పతనాన్ని చాటేందుకు కేసీఆర్ గారి ప్రభుత్వ హయాంలో వారి జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించి గౌరవించుకున్నామన్నారు .హైదరాబాద్ నగర నడిబొడ్డున సంత్ సేవాలాల్ మహారాజ్ పేరుతో లంబాడా బిడ్డల ఆత్మగౌరవం ఉట్టిపడేలా బంజారా భవన్ నిర్మించుకున్నాం. అని చెప్పారు.

సేవాలాల్ మహారాజ్ స్వప్నమైన తండా రాజ్యాన్ని సాకారం చేస్తూ రాష్ట్రంలోని తండాలను గ్రామపంచాయతీలుగా మార్చి’మా తండాలో మా రాజ్యం’ అనే గిరిజనుల చిరకాల ప్రజాస్వామిక ఆకాంక్షను కెసిఆర్ గారు నెరవేర్చారన్నారు . గ్రామ పరిపాలనలో వారిని భాగస్వాములను చేశారని అన్నారు. గిరిజన బిడ్డల ఆత్మగౌరవం పరిఢవిల్లేలా వారి ప్రతిభను చాటేందుకు ఎస్టీ ఓవర్సీస్ స్కాలర్ షిప్, పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు
సీఎంఎస్టీఈఐ వంటి కార్యక్రమాలను కెసిఆర్ గారి చేపట్టారు అని కొనియాడారు.
కార్యక్రమంలో పత్లావత్ చంద్రబోస్ ,సుమన్ నాయక్, బోనత్ సంతు , కొర్య రమేష్, సునీల్ నాయక్ ,వాసు నాయక్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుందర్, హనీఫ్, అశోక్ ముదిరాజ్, శ్యామ్, మొదలగు వారు పాల్గొన్నారు.