స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజ్ ల సత్తా చాటాలి ..మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ద విజయ్ కుమార్

స్థానిక సంస్థల ఎన్నికలలో ముదిరాజ్ ల సత్తా చాటాలి ..మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెద్ద విజయ్ కుమార్

  • త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులు సత్తా చాటాలని ప్రతి గ్రామంలో ఎంపిటిసి, జెడ్పిటిసి మరియు సర్పంచులు గా ముదిరాజులు గెలుపొంది రాజ్యాధికారం సాధించాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు మహబూబ్నగర్ జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్ అన్నారు.
  • తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు, శాసన మండలి డిప్యూటీ ఛైర్మెన్ బండ ప్రకాష్ పిలుపు మేరకు జిల్లాలోని గ్రామ గ్రామాన జెండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు .
  • సోమవారం మహబూబ్నగర్ మండల పరిధిలోని తెలుగు గూడెంలో ముదిరాజుల ఆత్మగౌర ప్రతీక జండా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు .

జనాభాపరంగా ముదిరాజుల సంఖ్య అధికంగా ఉన్న రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాలేక పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలు మారిన ప్రభుత్వాలు మారిన తరాలు మారిన ముదిరాజుల బ్రతుకులు మారడం లేదని ,ముదిరాజులు రాజ్యాధికారం అందుకోలేకపోతున్నారని గత 78 సంవత్సరాల నుంచి ఒక్క జడ్పిటిసి గెలవలేకపోవడం బాధాకరంగా ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులు గెలుపొందాలని ఆయన ఆకాంక్షించారు.

బీసీ ముదిరాజ్ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు మైత్రి యాదయ్య మాట్లాడుతూ…
ముదిరాజుల ఐక్యమత్యంగా ఉండి రాబోయే ఎన్నికల్లో సత్తా చాటాలని పరస్పరం గౌరవాలు ఆప్యాయతలు పెంచుకోవాలని సూచించారు.

ప్రముఖ కవి రచయిత బోల యాదయ్య మాట్లాడుతూ…
తెలంగాణ ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో ముదిరాజులను ఐక్యమత్యం చేస్తూ జండా కార్యక్రమాలు చేస్తూ ముదిరాజులు అందరిని ఐక్యమత్యం దిశగా నడిపిస్తున్న పెద్ద విజయ్ కుమార్ ముదిరాజ్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.మహబూబ్ నగర్ జిల్లా ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు మెట్టుకాడి ప్రభాకర్ ముదిరాజ్ మాట్లాడుతూ తాజాగా జరిగిన కుల గణనలో సంఖ్యను తగ్గించి చూపించడం జరిగిందని పార్టీలు ఏవైనా ముదిరాజులను అవమానపరచడం పార్టీలకు పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు ముదిరాజులను ఓటు బ్యాంకుగా వాడుకొని పదవులు పొందాక ముదిరాజులకు సముచిత స్థానం ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారన్నారు.ముదీరాజులను బీసీ డి నుంచి A గ్రూప్ లోకి మార్చాలని డిమాండ్ చేశారు. ముదిరాజులు వెనకటిలా అమాయకులు కారని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో తెలుగు సత్తా ఎడిటర్ ఆషన్న ముసంగి వెంకటేష్ బాలు ముదిరాజ్ రవి ముదిరాజ్ టి ఆంజనేయులు రామచంద్ర ముదిరాజ్ కే శ్రీనివాసులు చెన్నై ముదిరాజ్ మాజీ సర్పంచ్ శ్రీ రాములు సిద్దయ్య పోషన్న పెంటయ్య హనుమంతు బాలస్వామి తాటికొండ రాములు, కాశీం పెద్ద మాసన్న హనుమద్దాసు వెంకటేష్, చెన్నయ్య వెంకట రాములు కే వెంకటరాముడు చిన్న మాసన్న టీ తిరుపతయ్య కే రామచంద్రయ్య కే ఆంజనేయులు అమ్మ కే బాలమని బాలరాజ్ సుధాకర్ చిన్న కుర్మయ్య శంకరయ్య ఖాదర్ శేషములు రామకృష్ణ జంగయ్య పాండు ఆంజనేయులు మన్నెంకొండ తదితరులు పాల్గొన్నారు.

Related posts