మహా కుంభమేళాలో పాల్గొన్న.. మంత్రి కోమటిరెడ్డి
- ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో పాల్గొని బ్రహ్మ ముహూర్తంలో షాహీ పుణ్యస్నానం ఆచరించిన రాష్ట్ర రోడ్లు భవనాలు మరియు సినిమాటోగ్రఫీ శాఖ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
- ఉదయం గం. 5.10 నిమిషాలకు ప్రయాగరాజ్ లోని సంగం ఘాట్ లో పున్యస్నానం
- తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సంగం ఘాట్ లో ప్రత్యేక పూజలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని, ప్రజా ప్రభుత్వానికి నిరుపేదల సంక్షేమం కోసం పాటుపడేందుకు మరింత శక్తిని ప్రసాదించాలని ఆ భగవంతుడిని కోరుకున్న మంత్రి
మంత్రికి వేదాశ్వీర్వచనం ఇచ్చిన వేదపండితులు
అనంతరం శ్రీ బడే హనుమాన్ జీ దేవాలయాన్ని సందర్శించి హనుమంతుడికి మొక్కులు
మంత్రికి తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వదించిన పూజారులు..