21 మార్చ్ 2010
జేయేసీ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద నుండి తెలంగాణ ఉద్యమ బస్సుయాత్ర ప్రారంభం. నల్గొండ, ఖమ్మం మీదుగా అర్థరాత్రి మణుగూరుకు చేరుకున్న యాత్ర. మనుగూరులో భారీ బహిరంగ సభ.
ఉపఎన్నికల పోలింగ్
21 మార్చ్ 2012
ఉప ఎన్నికల ఫలితాలు
అధికార కాంగ్రేస్, విపక్ష టీడీపీలను ఉప పోరులో ఓటర్లు ఉతికి ఆరేశారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా అధికారంలో కొనసాగుతూ వస్తున్న ఆ రెండు పార్టీలనూ మూకుమ్మడిగా తిరస్కరించారు. తెలంగాణలో కారు, ఆటో దెబ్బకు చేయి చితికిపో యింది. సైకిల్ నుజ్జునుజ్జుయింది. ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలతో పాటు స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి కొట్టిన చావుదెబ్బకు టీడీపీ, కాంగ్రేస్ లు ఆగమయ్యాయి. తెలంగాణలో ప్రత్యేక వాదం గెలిచింది. టీఆర్ఎస్ నాలుగు స్థానాలను దక్కించుకోగా.. బీజేపీ ఒక స్థానంతో పాటు నాగం ఒక స్థానంలో
21 మార్చి 2013
సడక్ బంద్ సక్సెస్ పలువురు నేతల అరెస్ట్
టీజేఏసీ పిలుపుమేరకు శంషాబాద్ నుంచి అల్లంపూర్ వరకు 44వ నెంబర్ జాతీయ రహదారిని తెలంగాణవాదులు దిగ్బందించి సడక్ బందును సక్సెస్ చేశారు భారీగా మోహరించిన పోలీసుల కళ్ళు కప్పి నిర్దేశించుకున్న పాయింట్ల వద్దకు చేరుకున్న తెలంగాణవాదులు జై తెలంగాణ నినాదాలు చేశారు. ముందస్తు అరెస్టులు బైండోవర్లు కట్టడి చేయగలమని ప్రభుత్వం భావించిన ఉద్యమ రథసారథులు టీజేఏసీ చైర్మన్ కోదండరాం టిఆర్ఎస్ ఎంపీ నేత ఈటెల రాజేందర్ ఉద్యోగ జేఏసీ నేత శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి సహా ముఖ్య నాయకత్వాన్ని అరెస్టు చేశారు .1777 మంది కార్యకర్తలను అరెస్టు చేసి 57 కేసులు నమోదు చేశారు ఇంత నిర్బంధాన్ని సైతం ఛేదించుకొని సడక్ బందును విజయవంతం చేయడాన్ని జీర్ణించుకొని పోలీసులు వివిధ ప్రాంతాలలో ఉద్యమకారులపై రెచ్చిపోయి విచక్షణారహితంగా లాటి చార్జీ చేశారు.
అల్లంపూర్ సడక్ బంద్ కార్యక్రమం సందర్భంగా గురువారం ఉదయం టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్ జూపల్లి జితేందర్ రెడ్డి, మహబూబ్నగర్ జిల్లా అల్లంపూర్ టోల్గేట్ వద్దకు చేరుకున్నారు వారిని పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలోనే అక్కడికి టీజేఏసీ చైర్మన్ కోదండరాం కో కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ టోల్ గేట్ వద్దకు రావడంతో పోలీసులు వారిని అడ్డుకొని బలవంతంగా అరెస్టు చేసి కర్నూలు జిల్లా మీదుగా రాజోలి పోలీస్ స్టేషన్ కి తరలించారు. చెన్నూరు ఎమ్మెల్యే కావేటి సమ్మయ్య ఆధ్వర్యంలో దాదాపు 200 మంది కార్యకర్తలు పొలాల వెంట పరిగెత్తుతూ టోల్గేట్ వద్దకు చేరుకున్నారు. మంచిర్యాల ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి న్యాయవాదుల జేఏసీ నేత రాజేందర్ రెడ్డి సిపిఐ నాయకుడు చాడ వెంకటరెడ్డి లతో పాటు పలువురిని అలంపూర్ టోల్గేట్ వద్ద అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు.
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ కేంద్రంలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నప్పటికీ ఎలికిచర్ల గోపులాపూర్ పోతులమడుగు శేరిపల్లి గ్రామాల నుంచి మహిళలు అధిక సంఖ్యలో తరలివచ్చి సడక బందులో పాల్గొన్నారు. ఈ కేంద్రంలో ఆందోళన నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలు సోమారపు సత్యనారాయణ వినయ్భాస్కర్ విద్యాసాగర్ అన్నం శ్రీనివాస్ రెడ్డిలతో పాటు టీపీఎఫ్ రాష్ట్ర నాయకులు వేద కుమార్ రత్నమాల నరసయ్యలను పోలీసులు అరెస్టు చేసి బిజినేపల్లి జడ్చర్ల భూత్పూర్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు.
మహబూబ్నగర్ జిల్లా కొత్తకోట మండలం కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై రైతులు ఎడ్లబండ్లతో రహదారిని దిగ్బంధించారు కంగుతిన్న పోలీసులు ఎడ్లబండ్లను రహదారి నుంచి పక్కకు తొలగించేందుకు నానాదంతాలు పడ్డారు రాణిపేట గ్రామం నుంచి రహదారిపైకి వచ్చిన ఎమ్మెల్యే రాజయ్య బిక్షపతి జోగు రామన్న కొప్పుల ఈశ్వర్ టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డిలు రహదారిపై టైర్లను తగలబెట్టి నిరసన వ్యక్తం చేయగా వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రంగారెడ్డి జిల్లా పాలమాకుల సడక్ బంద్ సందర్భంగా జన సంద్రాన్ని తలపించింది పాలమాకుల సభా వేదిక వద్ద ఉదయం 6 గంటలకు వేలాదిగా తెలంగాణ వాదులు తరలివచ్చారు ముందస్తు వ్యూహం ప్రకారం శంషాబాద్ లో బస చేసిన ఉద్యమకారులు ఉదయం ఎనిమిది గంటలకు టిఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుతో కలిసి సభ వేదిక దగ్గరలోని ఇంద్రారెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నిరసన కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం నేతలంతా రోడ్డుపై బైఠాయించి నాలుగు గంటల పాటు పూర్తిగా రహదారిని స్తంభింపజేశారు దేశపతి రసమయి సాయిచంద్ కళాకారుల బృందం ఆటపాటలతో సభా ప్రాంగణం హోరెత్తింది అక్కడే సహపంతి భోజనాలు చేశారు మద్యహానానికి వేదిక వద్దకు వేలాదిగా పోలీసు బలగాలు చేరుకొని బలవంతంగా ఉద్యమకారుల వారు చేశారు. అరెస్ట్ అయిన వారిలో టిఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి కర్నే ప్రభాకర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ మహిళా నాయకురాలు తులా ఉమా పిఓడబ్ల్యు నేత సంధ్యా తదితరులు ఉన్నారు. కాగా మహబూబ్నగర్ జిల్లా తిమ్మాపూర్ లో జిల్లా జేఏసీ సిపిఐ నేతలు చలమారెడ్డి బాల మల్లేష్ మాజీ ఎంపీ అజీజ్ బాషా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ మస్కు నర్సింహులను అరెస్టు చేసి కొత్తపేట పిఎస్ కు తరలించారు సడక్ బందులో బిజెపి రాష్ట్ర నాయకులు విద్యాసాగర్ నాగం జనార్దన్ రెడ్డి బద్దం బాల్రెడ్డి ఆనంద్ కుమార్ మల్లారెడ్డి బొక్క నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో పోలీసులు తెలంగాణ వాదుల మధ్య తోపులాట చోటుచేసుకుంది ఉదయం నుంచి జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలుపుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు మాచారం గ్రామం వద్ద టిఆర్ఎస్ నేత లక్ష్మారెడ్డిని అరెస్టు చేసి తిమ్మాజీపేట పోలీస్ స్టేషన్కు తరలించారు బాలానగర్ వద్ద టియుఎఫ్ నాయకురాలు విమలక్క రామ్ దాస్ నాయక్ రాజాపూర్ వద్ద ఎమ్మెల్సీలు జనార్ధన్ కూన రవీందర్ పిఆర్టియు నేత వెంకట్రెడ్డిలు సడక్ బంధువులు నిర్వహించారు గొల్లపల్లి వద్ద బిజెపి నాయకులు జడ్చర్ల క్రాస్ రోడ్ వద్ద న్యూ డెమోక్రసీ నేతలు ధర్నాకు చేపట్టగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్ కొత్తూరు తిమ్మాపూర్ ప్రాంతాలలో పోలీసుల ఓవరాక్షన్ వల్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి సడక్ బందులో పాల్గొనేందుకు అన్నారం గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే కేటీఆర్ హరీశ్వర్ రెడ్డి ఎండల లక్ష్మీనారాయణ గుండా మల్లేష్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ లను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసు వాహనాలను వెళ్ళనీయకుండా గ్రామస్తులు ట్రాక్టర్లను ప్రోక్లైన్లను రహదారికి అడ్డంగా పెట్టారు షాద్నగర్లో న్యాయవాదులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు బాలనగర్ లో రోడ్డుకు అడ్డంగా టైలర్ వేసి తగలబెట్టారు.
ఓయూ లో ఉద్రిక్తత
టీజేఏసీ పిలుపుమేరకు సడక్ బందులో పాల్గొనేందుకు బయలుదేరిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులను ఎన్సిసి గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు విద్యార్థి నేతలను అరెస్టు చేసి నల్లకుంట పిఎస్ కు తరలించారు పోలీసులపైకి విద్యార్థులు రాళ్లు విరడంతో ఉద్రిక్తత తలెత్తింది పోలీసుల వైఖరితో ఆగ్రహం చెందిన విద్యార్థులు రోడ్డుపై ఉన్న సింటెక్స్ డబ్బాకు నిప్పంటించారు పోలీసుల కల్లుగప్పి సడక్ బందులో పాల్గొన్న విద్యార్థులను శంషాబాద్ లో పోలీసులు అరెస్టు చేశారు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఎన్సిసి గేటు వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య అధ్యక్షతన తెలంగాణ జేఏసీ అత్యవసర సమావేశం సందర్భంగా ప్రభుత్వం ప్రయోగించిన నిర్బంధాన్ని తీవ్రంగా ఖండించిన జేఏసీ భాగస్వామ్య పార్టీలు ప్రభుత్వ దిష్టిబొమ్మల దహనానికి నిర్ణయం.