మాజీ సీఎం కెసిఆర్ ను కలిసిన.. కర్నె అరవింద్
బి ఆర్ ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ( గజ్వెల్ ) ఎర్రవల్లి లోని వ్యవసాయ క్షేత్రంలో మర్యాద పూర్వకంగా కలిసిన బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నాయకులు కర్నె అరవింద్.గత నెల శబరిమల అయ్యప్ప స్వామి దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన అరవింద్ కోలుకున్న తరువాత పార్టీ అధినేతను కలిశారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కెసిఆర్ అరవింద్ ఆరోగ్యం యోగ క్షేమాలు, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు అడిగి తెలుసుకున్నట్లు కర్నె అరవింద్ తెలిపారు.
