ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్
తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క గారి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్, వనస్థలిపురంలోని ఓల్డ్ ఏజ్ హోమ్ రెడీ టు సెర్వ్ ఫౌండేషన్ వారి వృద్ధాశ్రమం లో కేక్ కట్ చేసి వృద్ధుల సమక్షంలో వారి ఆశీస్సులుతో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మందుల సూర్య కిరణ్,మార్కెట్ డైరెక్టర్ జైపాల్ రెడ్డి, అనిల్ ,ప్రవీణ్ , సంస్థ నిర్వాహకులు శంకర్ తదితరులు పాల్గొన్నారు.