ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖరం, ఉమ్మడి కృష్ణ – గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఘన విజయం సాధించడం పట్ల ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీలుగా విజయం సాధించి చట్టసభలో అడుగుపెడుతున్న వీరభత్తుల రాజశేఖరం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లకు ఎంపీ మహేష్ కుమార్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి మద్దతుగా నిలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మద్దతుగా నిలిచిన విద్యావంతులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మరోసారి పట్టం కట్టారని ఎంపీ మహేష్ కుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 8 నెలల్లోనే చేపట్టిన అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటుందనడానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించడమే నిదర్శనమని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఎమ్మెల్సీలుగా అఖండ విజయం సాధించిన పేరాబత్తుల రాజశేఖరం, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగా అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తారని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయానికి తీవ్రంగా శ్రమించిన కూటమి నాయకులు, కార్యకర్తలకు ఎంపీ మహేష్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.