ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ యాదాద్రి భువనగిరి జిల్లా ,మోత్కూరు పురపాలిక పరిధిలోని లక్ష్మీ నరసింహా ప్రింటింగ్ ప్రెస్ తో గత నలభై ఏళ్ళకు పైగా వివాహ ఆహ్వాన పత్రికలు, కరపత్రాల ప్రచురణలో అన్ని వర్గాల ప్రజల మనసు గెలుచుకున్న నారబోయిన పాపయ్య ముదిరాజ్ మృతి ప్రింటింగ్ ప్రెస్ లోకానికి తీరని లోటని కాంగ్రెస్ పార్టీ పట్టన అధ్యక్షుడు గుండగోని రామచంద్ర గౌడ్ మరియు ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శి కోమటి మత్స్య గిరి సంయుక్తంగా ప్రకటన ద్వారా తెలిపారు.ఈ రోజు మోత్కూర్ లోజరిగిన పాపయ్య దశ దిన కార్యక్రమంలో పాల్గొని పాపయ్య చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామన్నపేట పాత తాలూకా స్థాయిలో అట్టడుగు వర్గాల వారికి అతి తక్కువ ఖర్చుతో ఆహ్వాన పత్రికలు ముద్రించిన…
Read MoreCategory: Newsbeat
మహిళా కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తా రేఖ బోయలపల్లి
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గ ఇటీవల ఎన్నికైన సూర్యాపేట జిల్లా ,తుంగతుర్తి నియోజకవర్గం నాయకురాలు శ్రీమతి డా.రేఖా బోయలపల్లి గారిని నల్లగొండ యూత్ కాంగ్రెస్ నియోజకవర్గం అధ్యక్షులు మామిడి కార్తీక్ అద్వర్యం లో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో యాత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గాలి నాగరాజు , పాదం అనిల్ , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కత్తుల కోటి, చింతపల్లి గోపాల్, కంచర్ల ఆనంద్ రెడ్డి, మల్లికంటి సిద్దు, రంజిత్ ,పృథ్వి, శ్రవణ్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.
Read Moreతెలంగాణ ఉద్యమం లో (22 మార్చి) నేటి సంఘటనలు
22 మార్చి 2010 జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ ఉద్యమ యాత్ర రెండవ రోజు భద్రాచలంలో ప్రారంభమై పాల్వంచ కొత్తగూడెం ఇల్లందు బయ్యారం తదితర ప్రాంతాల మీదుగా ఖమ్మం చేరుకుంది. 22 మార్చి 2011 న చెప్పుకోదగ్గ సంఘటనలు ఏమీ జరగలేదు 22 మార్చి 2012 న తెలంగాణ ఉద్యమంలో పెద్దగా చెప్పుకోదగిన సంఘటనలు ఏమీ లేవు 22 మార్చి 2013 అరెస్టులకు నిరసనగా తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు సడక్ బంద్ సందర్భంగా గురువారం తెలంగాణ ఉద్యమ నాయకులను తెలంగాణ వాదులను అరెస్టు చేసి జైలలో నిర్బంధించడాన్ని నిరసిస్తూ తెలంగాణ పది జిల్లాల్లో నిరసన హోరెత్తాయి. తెలంగాణ వ్యాప్తంగా రాస్తారోకోలు ధర్నాలు దిష్టిబొమ్మ దహనాలను నిర్వహించారు. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విద్యావంతుల వేదిక నిజామాబాద్ జిల్లా మహాసభ నూతన…
Read Moreచివరి తెలంగాణ ఉద్యమం లో ” మార్చ్ 21 “
21 మార్చ్ 2010 జేయేసీ ఆధ్వర్యంలో గన్ పార్క్ వద్ద నుండి తెలంగాణ ఉద్యమ బస్సుయాత్ర ప్రారంభం. నల్గొండ, ఖమ్మం మీదుగా అర్థరాత్రి మణుగూరుకు చేరుకున్న యాత్ర. మనుగూరులో భారీ బహిరంగ సభ. ఉపఎన్నికల పోలింగ్ 21 మార్చ్ 2012 ఉప ఎన్నికల ఫలితాలు అధికార కాంగ్రేస్, విపక్ష టీడీపీలను ఉప పోరులో ఓటర్లు ఉతికి ఆరేశారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా అధికారంలో కొనసాగుతూ వస్తున్న ఆ రెండు పార్టీలనూ మూకుమ్మడిగా తిరస్కరించారు. తెలంగాణలో కారు, ఆటో దెబ్బకు చేయి చితికిపో యింది. సైకిల్ నుజ్జునుజ్జుయింది. ఆరు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్, బీజేపీలతో పాటు స్వతంత్ర అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి కొట్టిన చావుదెబ్బకు టీడీపీ, కాంగ్రేస్ లు ఆగమయ్యాయి. తెలంగాణలో ప్రత్యేక వాదం గెలిచింది. టీఆర్ఎస్ నాలుగు స్థానాలను దక్కించుకోగా.. బీజేపీ ఒక…
Read Moreప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ”అక్టోబర్” నెల పాత్ర
అక్టోబర్ 09 -2009 ఫ్రీజోన్ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు. హైదరాబాద్ 6వ జోన్లో భాగమైన ప్పటికి రాష్ట్రపతి ఉత్తర్వు లోని 14ఎఫ్ నిబంధన అనుసరించి పోలీస్ అధికారుల నియామకాల విషయంలో మాత్రం ఫ్రీజోన్గా పరిగణించాలని తీర్పునిచ్చింది. అక్టోబర్ 11 – 2009 ఫ్రీజోన్ పై సుప్రీం కోర్టు తీర్పుకు నిరసనగా తెలంగాణ ఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో టిఎన్టీవో భవన్ నుంచి ఛలో అసెంబ్లీ కార్యక్రమం, గన్ పార్కువద్ద జరిగింది. 13 అక్టోబర్ -2009 ఫ్రీజోన్ పై సుప్రీం కోర్టు తీర్పుకు నిరసనగా తెలంగాణ ఎన్జీఓల సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు ధర్నా. అక్టోబర్ 4 – 2010 తెలంగాణ కోసం తెలంగాణ జర్నలిస్టుల నినాదంతో తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఆధ్వర్యంలో హైదరాబాదులో మీడియా మార్చ్ నిర్వహించడం జరిగింది. అక్టోబర్ 5…
Read Moreఊరు వాడ ఘనంగా హోలీ సంబరాలు
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ హోలీ పర్వదినం సందర్బంగా దేశవ్యాప్తంగా ఊరు వాడలో ప్రజలు ఘనంగా జరుపుకున్నారు.దేశ వ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలతో పాటు అన్ని ప్రాంతాలలో ఘనంగా జరుపుకున్నారు. పలువురు కేంద్ర మంత్రులు ,తెలుగు రాష్ట్రాల మంత్రుల తో పాటు ముఖ్య నాయకులు, ప్రముఖులు ,కార్యకర్తలు రంగులు చల్లుతూ డాన్సులు చేస్తూ ప్రజలతో కలిసి ఆనందంగా హోలీ ఉత్సవాలలో పాల్గొన్నారు. హోలీ శుభాకాంక్షలు తెలిపిన పలువురు మంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రెండు తెలుగు రాష్ట్రాల పలువురు మంత్రులు .తెలంగాణ రాష్ట్ర రవాణ మరియు బి సి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖల మంత్రి లోకేష్ కుమార్ ,టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ ,టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి…
Read Moreకార్పొరేట్ కు దీటుగా 100 పడకల హాస్పిటల్ ఏర్పాటు ..మంత్రి లోకేష్
ఈ నెల 27 వరకు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ 19 న అసెంబ్లీ లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్న ఆర్ధిక మంత్రి27 న ద్రవ్య వినిమయ బిల్లు పై చర్చ ఈ రోజు ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవగా ,ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగించారు.సమావేశాలకు హాజరైన ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్. రేపటికి వాయిదా పడిన అసెంబ్లీ .రేపు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మాణం ,14న హోలీ సందర్బంగా అసెంబ్లీకి సెలవు,15వ తేదిన ధన్యవాద తీర్మాణంపై చర్చ16వ తేదిన ఆదివారం అసెంబ్లీకి సెలవు,17న ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధతపై చర్చ,18న బీసీ కుల గణన, రిజర్వేషన్లపై చర్చ19న 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రవెశపెట్టనున్న ప్రభుత్వం,20న అసెంబ్లీకి సెలవు,21వ తేది నుంచి బడ్జెట్ పై చర్చ27 వరకు కొనసాగనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.
Read Moreనిరుద్యోగులకు అండగా.. ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండగ.. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్
ది ఈగల్ న్యూస్ : హైదరాబాద్ నిరుద్యోగులకు అండగా ప్రజా ప్రభుత్వంలో కొలువుల పండగ అనిఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు.హైదరాబాద్ లోని రవీంద్రభారతీలో జరిగిన ఉద్యోగులకు నియామక పత్రాలు అందించిన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, పాల్గొన్న మంత్రలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. 1,292 మంది, జూనియర్ లెక్చరర్లకు, 240 మంది పాలిటెక్నిక్ లెక్చరర్లకు నియామక పత్రాలు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా బలమూరి వెంకట్ మాట్లాడుతూ .. 12 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వని బీఆర్ఎస్ సర్కార్,12 నెలల పాలనలోనే 55వేల ఉద్యోగాలు ఇచ్చిన రేవంత్ సర్కార్ అని చెప్పారు.మొన్న గ్రూప్-1, నిన్న గ్రూప్-2 ఉద్యోగాల ఫలితాలు వెల్లడించిన టీజీపీఎస్సీ,55 రోజుల్లోనే ఉపాధ్యాయ పరీక్షలను నిర్వహించి ఉద్యోగాలను కల్పించాం అని అన్నారు.12 నెలల పాలనలోనే 55వేల ఉద్యోగాలు కల్పించిన ఘనతరేవంత్ సర్కార్ డి…
Read Moreకాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కొలువుల జాతర ..చనగాని దయాకర్
ది ఈగల్ న్యూస్: హైదరాబాద్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే కొలువుల జాతర అని ,కాంగ్రెస్ ప్రభుత్వం తోనే నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయని టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్ అన్నారు. గాంధీభవన్ లో ఏర్పాటు చేసిన మీడియ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రూప్ 1 ,గ్రూప్ 2 నూతన అభ్యర్థులు ప్రజా పాలనలో భాగం కావాలని పిలుపు నిచ్చారు.కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉద్యోగాల భర్తీ సాధ్యమని రుజువు అయిందని అన్నారు. పది ఏళ్లలో సాధ్యం కాని గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు భర్తీ కాంగ్రెస్ ప్రభుత్వం లో సాధ్యం అయిందని అన్నారు.బి ఆర్ ఎస్ హయాంలో లీకేజీ ల తో నిరుద్యోగులు భయం తో పరీక్ష లకు దూరం అయ్యారని చెప్పారు.దేశంలో తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అత్యంత పారదర్శకంగా పరీక్షలు జరిపిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానిది…
Read More