సత్యసాయి జిల్లాలో విద్య మరియు ఐటీ శాఖల మంత్రి వర్యులు లోకేష్ కు అడుగడుగునా జన నీరాజనం పలికారు
జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి లోకేష్ కు బ్రహ్మరథం పట్టిన జిల్లా ప్రజలు
పుట్టపర్తి విమానాశ్రయం నుంచి కదిరి వరకు మంత్రి లోకేష్ కు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు
ఘనస్వాగతం పలుకుతూ పూలవర్షం కురిపించిన స్థానికులు
బాణసంచా కాల్చుతూ అభిమానం చాటుకున్న ప్రజలు
తన కాన్వాయ్ ను ఆపి ప్రతిఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్, ప్రజల నుంచి అర్జీలు స్వీకరణ
శ్రీ సత్యసాయి జిల్లాలో విద్య, ఐటీ శాఖల మంత్రి వర్యులు నారా లోకేష్ పర్యటన…
శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనలో భాగంగా ముందుగా పుట్టపర్తి విమానాశ్రయానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖల మంత్రి వర్యులు నారా లోకేష్ చేరుకున్నారు. ఘనస్వాగతం పలికిన కదిరి ఎంఎల్ఏ కందికుంట వెంకట ప్రసాద్, హిందూపూర్ ఎంపీ బీకే పార్థసారథి, ఇతర టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు.కదిరి శ్రీమత్ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న మంత్రి లోకేష్.బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఖాద్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవం.స్వామివారి కల్యాణోత్సవానికి ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు మంత్రి లోకేష్ సమర్పించారు.