హైదరాబాద్ , సనత్ నగర్ లోని దాసారం బస్తికి చెందిన చిన్నారి మల్లెల శ్రీవిద్య వయసు ఎనిమి సంవత్సరాలు.సనత్ నగర్ దాసారం బస్తీలో నివాసం ఉంటూ రోజు వారి కూలి పనిచేస్తూ జీవనం కొనసాగించే అశోక్, మమత దంపతుల కూతురును ఏడాది క్రితం స్థానికంగా ఓ ప్రైవేటు పాఠశాలలో శ్రీవిద్యను చేర్పించారు. ఆమెకు బర్త్ సర్టిఫికెట్, ఆధార్ లేదంటూ ఆ స్కూలు నిర్వాహకులు శ్రీవిద్యను బడికి పంపొద్దని తల్లిదండ్రులకు చెప్పడంతో చిన్నారిని పాఠశాలకు తోలడం మానేశారు. అప్పటినుండి పాప ఇంటి వద్దనే ఉండడం జరుగుతుంది. చిన్నారికి బర్త్ సర్టిఫికెట్ లేకపోవడంతో ఆధార్ కార్డు తీసుకోలేకపోయామని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న సనత్ నగర్ నియోజకవర్గ ఇన్చార్జి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి డా. కోట నిలిమా ఈరోజు చిన్నారి ఏ పాఠశాలలో చదవాలని అయితే కోరిందో అదే పాఠశాలలో యాజమాన్యంతో మాట్లాడి శ్రీవిద్యను చేర్పించడం జరిగింది.
చిన్నారి శ్రీవిద్య విషయంలో జోక్యం చేసుకొని పాఠశాలలో చేర్చుకునేందుకు తోడ్పాటు అందించిన తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ శ్రీ ఆకునూరి మురళి గారికి డా. కోట నీలిమ గారు ధన్యవాదాలు తెలిపారు.తమ కూతురును స్కూల్లో చేర్పించినందుకు శ్రీవిద్య తల్లిదండ్రులు కోట నీలిమ గారికి రుణపడి ఉంటామని ధన్యవాదాలు తెలిపారు.