తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం హైదరాబాద్ లో గల ఇందిరాభవన్ లో అఖిల భారత యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి అద్వర్యం లో జరిగిన యంగ్ ఇండియా కె బోల్ సీజన్ 5 సెలక్షన్ లో భాగంగా,దేశం లో పెరిగిపోతున్న నిరుద్యోగ సమస్య -డ్రగ్స్ వలన తప్పుదోవ పడుతున్న యువత అనే అంశం పై జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువత వచ్చి తమ సందేశాన్ని వినిపించారు.
ఈ కార్యక్రమానికి న్యాయ నిర్నేతలు గా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, సనత్ నగర్ నియోజకవర్గం ఇంచార్జి డా.కోట నీలిమ గారు,టీపీసీసీ ప్రధాన కార్యదర్శి డా.అద్దంకి దయాకర్ గారు,రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివచరణ్ రెడ్డి గారు,సీనియర్ జర్నలిస్ట్ పిల్లలమర్రి శ్రీనివాస్ గారు వ్యవహరించారు.