ఎంపీ చామల పై బీఆర్ఎస్ అసత్య ప్రచారం తగదు..మహేందర్
- భువనగిరి పార్లమెంట్ సభ్యులు ఛామల కిరణ్ కుమార్ రెడ్డి పై బి ఆర్ ఎస్ తప్పుడు ప్రచారం మానుకోవాలి
- ప్రజానాయకుడిపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు
— చేడే మహేందర్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి
భువనగిరి పార్లమెంటు సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంటు వేదికగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై కేంద్రాన్ని నిలదీయడం, ప్రజా సమస్యల పట్ల మాట్లాడటం, మరియు ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్టాలను తెలుసుకొని పరిష్కరించే విదంగా పనిచేస్తూ ప్రజానాయకుడిగా పేరు సంపాదించారు.అలంటి నాయకుడి పై దుష్ప్రచారం చేయడం సరికాదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శిచేడే మహేందర్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు .
కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రశ్నిస్తూ, రాష్ట్రానికి రావాల్సిన విభజన హామీలు , హక్కుల కోసం పోరాడుతూ, ప్రజా ప్రయోజనాలను కాపాడటంలో ముందుండే నాయకుడిగా ఆయన ప్రజల విశ్వాసాన్ని పొందారని అన్నారు.ఆయన ప్రజాదరణను చూసి ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తుందని చెప్పారు. ఆయన మంచితనాన్ని ప్రజల్లో నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తుందని అన్నారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు తప్పుడు ఆరోపణలు, అసత్య ప్రచారాలు చేస్తుందని, అసత్య ఆరోపణలు రాజకీయ కుట్రలో భాగమేనని అన్నారు.
ఈ తప్పుడు ప్రచారాలను బీఆర్ఎస్ మానుకోవాలి, లేకపోతే తగిన సమయంలో తగిన బుద్ధి చెప్పడం తపదనారు. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలని , బీఆర్ఎస్ చేసే అసత్య ప్రచారాలను నమ్మొద్దని కోరారు.