జర్నలిస్ట్ మల్లారెడ్డి ని పరామర్శించిన టిజెయూ జిల్లా అధ్యక్షుడు షానూర్ బాబా
యాదాద్రి భువనగిరి జిల్లా, గుండాల మండలం, మాసాన్ పల్లి గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయులు, సాక్షి రిపోర్టర్ అట్ల మల్లారెడ్డి తండ్రి గారు అట్ల సత్తి రెడ్డి ఇటీవల అనారోగ్యంతో స్వర్గస్తులయ్యారు.విషయం తెలుసుకున్న తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా మల్లారెడ్డి స్వగృహానికి వెళ్లి వారి తండ్రి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు .
జర్నలిస్ట్ మల్లారెడ్డి కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.ఆయన వెంట తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ గుండాల మండల అధ్యక్షులు సూరారపు నరేష్, ఉపాధ్యక్షులు పొన్నగాని యాదగిరి, కోశాధికారి చిలుకూరి మోహన్, సభ్యులు అంబదాస్ తదితరులు ఉన్నారు.