బి ఆర్ ఎస్ సోషల్ మీడియాలో అబద్ధాలు ప్రచారం చేస్తుంది ..ఎమ్మెల్యే కుంభం
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి చూస్తూనే సోషల్ మీడియాలో
బీఅర్ఎస్ పార్టీ అబద్దాలు ప్రచారంచేస్తోంది అని భువనగిరి శాసన సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు .భువనగిరిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం లో పాల్గొని మాట్లాడారు .రాష్ట్రము లో అన్ని సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు చేస్తున్నము ,రైతు రుణమాఫీ చేశాము కొన్ని సాంకేతిక కారణాల వల్లా ఒకరి ఇద్దరికి రాక పోతే అదికూడా త్వరలో వస్తుందని అన్నారు .రాష్ట్ర బడ్జెట్లో 60 వెల కోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీ కడుతున్నము.మూసి ప్రక్షాళన చేసి సాగుకు స్వేచ్ఛమైన నీరు అందిస్తామని చెప్పారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నీ స్థానాల్లో గెలుస్తాము.ఎస్సీ వర్గీకరణ అమలు చేసే ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అన్నారు. బీసీ కులగణన ను స్వాతంత్య్రం వచ్చిన తరువాత ఎవరు చేయలేదు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసి చూపించాడు.