సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలోని బోడిగెపల్లి గ్రామంలో 1.5 కోట్లతో Pwd రోడ్డు నుండి బోడిగపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.అక్కన్నపేట్ మండలం బంజారాహిల్స్ తండా లో తాగునీటి పైప్ లైన్లు & నల్లాలను ప్రారంభించారు.గౌరవెల్లి ప్రాజెక్టు నిర్వాసితులు బంజారాహిల్స్ తండా ను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేస్తామని రోడ్ల సౌకర్యం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
గౌరవెళ్లి పంచాయతీ పరిధిలోని సేవలల్ కాలని లో వాటర్ ట్యాంక్ & మంచినీటి పైప్ లైన్ ను ఓపెన్ చేశారు.అక్కన్న పేట మండలం సేవలాల్ మహారాజ్ తండా లో నూతన తండా -2 వద్ద OHSR & పైప్ లైన్ శంఖు స్థాపన చేశారు.అక్కన్న పేట మండలం తుక్కితండా( నందారం) లో 58 లక్షలతో జడ్పీ రోడ్డు నుండి తుక్కితండా వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ సందర్బంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ….
చాలా కాలంగా నిర్లక్ష్యానికి గురైన హుస్నాబాద్ గ్రామీణ ప్రాంత నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి,ఉప ముఖ్యమంత్రి , పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గారి సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా లంబాడి తండాల్లో రోడ్లు పూర్తి చేసే ప్రక్రియలో భాగంగా నిన్న కొహెడ , చిగురు మామిడి,ఈరొజు అక్కన్నపేట , హుస్నాబాద్ మండలాల్లో శంకుస్థాపనలు చేసుకుంటున్నాం అని అన్నారు.
ఇవే కాక ఇంకా కొన్ని రోడ్ల నిర్మాణాలు చేయాల్సి ఉంది.వాటిని కూడా త్వరలోనే మంజూరు చేసి హుస్నాబాద్ వెనుకబడిన ప్రతి గ్రామంలో రోడ్లు సౌకర్యం కల్పిస్తాం అని చెప్పారు.
తాగు నీటి సమస్యలు లేకుండా చూస్తున్నాం.విద్యా , వైద్యం ,ఉపాధి అవకాశాలు కోసం స్థానిక శాసన సభ్యులు గా మంత్రిగా ప్రజలకు సహకారం అందిస్తున్నా అని అన్నారు.
శంఖు స్థాపన లు , ప్రారంభోత్సవాలు డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్ లు ప్రారంభిస్తున్నాం,రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్లు ,రేషన్ కార్డులు భూమిలేని ఉపాధి కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా.. రైతులకు రైతు భరోసా అందిస్తున్నాం.అధికారులు ఇప్పటికే సమీక్షా చేస్తున్నారు.ఈ ప్రాంతంలో గౌరవేళ్లి నిర్వాసితుల సమస్యలను పరిష్కారం చేస్తాం అని చెప్పారు.
గౌరవెల్లి ప్రాజెక్టు ద్వారా సాగునీటి వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి అనుబంధ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం అని అన్నారు.