ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు
The Eagle News నల్లగొండ
నల్గొండ జిల్లా లోని నార్కట్ పల్లి మండలం చెర్వుగట్టు శ్రీ పార్వతి సమేత జడల రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈ రోజు స్వామి అమ్మవారుల కళ్యాణం ఘనంగా జరిగింది.ఈ కళ్యాణంలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం దంపతులు, దేవాదాయ అధికారులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్ల కళ్యాణం సందర్బంగా పోలీస్ శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది.