ముమ్మరంగా నూతన సంత ఏర్పాటు పనులు
సూర్యాపేట జిల్లా ( తుంగతుర్తి నియోజకవర్గం ) నాగారం మండల కేంద్రం లో నూతనంగా ఏర్పాటు చేసే ( అంగడి ) సంత ప్రారంభోత్సవ పనులు ముమ్మరం జరుగుతున్నాయి. మండల కేంద్రంలో ఈనెల 14వ తారీకు శుక్రవారం రోజున ప్రారంభం కానున్న సంతపనులు ముమ్మరం చేస్తున్నట్లు సంత వ్యవస్థాపక నిర్మాణ కమిటీ మరియు స్థానికులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంతలో నాగారం మండల ప్రజలు, పరిసర మండల , గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు. ఈ సంత ప్రారంభోత్సవంలో రైతులకు పేదలకు అందరికి సరసమైన ధరలు నిత్యవసరాలు కూరగాయలు అందుబాటులో ఉంటాయని అదేవిధంగా మేకలు పశువులు తదితర నిత్యవసరాలన్నీ రైతులకు పేదలకు అందుబాటులో ఉంటాయని చెప్పారు. అదేవిధంగా గ్రామ పంచాయతీకి ఆదాయం చేకూరుతుందని అన్నారు.