యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో శుక్రవారము రోజున ముక్కోటి ఏకాదశి

యాదగిరిగుట్ట (The Eagle News):
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఈ నెల 10 న శుక్రవారము రోజున ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పర్వదినము సందర్భముగా ఉదయము 5:15 ని లకు శ్రీ స్వామి వారు ఉత్తర ద్వారము ద్వారా గరుడ వాహనము పై వేంచేసి భక్తులందరకు దర్శనభాగ్యము కల్పించెదరు. శ్రీ స్వామి వారి ఉత్తర ద్వార దర్శనము తిలకించేందుకు విచ్చేయు భక్తుల సౌకర్యార్థము దర్శన సదుపాయములు ఏర్పాట్లు చేసినట్లు దేవస్థానం కార్యనిర్మాణాధికారి ఎ. భాస్కర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు.

భక్తులు, స్థానికులు నిర్దేశిత సమయమునకు ముందస్తుగా విచ్చేసి విశేష సంఖ్యలో శ్రీ స్వామి వారిని దర్శించి, తరించి శ్రీ స్వామి వారల ఆశీస్సులు పొందవలసినదిగా కోరారు.

Related posts