తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కార్పొరేటర్ బన్నాల..
ఉప్పల్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ గారి పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు తెలంగాణ రాష్ట్ర ప్రధాత మాజీ సీఎం కెసిఆర్, మాజీ మంత్రి సిరిసిల్ల ఎమ్మెల్యే, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గార్లపై మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై, ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గ ప్రజలపై ఉండాలని కోరినట్లు తెలిపారు.