మెల్బోర్న్ సంక్రాంతి సంబరాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. మెల్బోర్న్ , క్రాగిబర్న్ లో జరిగిన సంక్రాంతి సంబురాలకు మెల్బోర్న్ తెలంగాణ ఫోరం MTF వారి ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా భువనగిరి పార్లమెంట్ సభ్యులు శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు హాజరయ్యారు. ఈ సందర్భంగా MTF ఆధ్వర్యంలో ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి గారిని మర్యాద పూర్వకంగా సత్కరించారు. ఈ సంక్రాంతి సంబరాలలో మెల్బోర్న్ తెలంగాణ ఫోరం MTF ప్రెసిడెంట్ నూకల లక్ష్మీ వెంకట్ రెడ్డి మరియు ప్రముఖులు పాల్గొన్నారు.
